యెహోవా నా కాపరి (లోయలలో) Song Lyrics

యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి
నాకు లేమి లేదు – (2)
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా||

పచ్చికగల చోట్ల
నన్ను పరుండజేయును (2)
శాంతికరమగు జలముల కడకు
నన్ను నడిపించును (2) ||లోయలలో||

గాఢాంధకారపు లోయలలో
సంచరించినను (2)
అపాయమేమియు కలుగదు నాకు
నీవు తోడుండగా (2) ||లోయలలో||

తన నామమున్ బట్టి
నన్ను నీతి మార్గములో (2)
త్రోవ చూపి నడిపించును
సేదదీర్చును (2) ||లోయలలో||

చిరకాలము నేను
యెహోవా సన్నిధిలో (2)
నివాసమొందెదను నేను
నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో||

యెహోవా నా కాపరి (లోయలలో) telugu christian video song


యెహోవా నా కాపరి (లోయలలో) Song Lyrics