యెహోవా నా కాపరి Song Lyrics

యెహోవా నా కాపరి నాకు లేమిలేదు
పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా ||

మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా ||

పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను || యెహోవా ||

నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా ||

చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసమొందెదను || యెహోవా ||

యెహోవా నా కాపరి telugu christian video song


యెహోవా నా కాపరి Song Lyrics