యెహోవా నను కరుణించుమా Song Lyrics

యెహోవా నను కరుణించుమా
నా దేవా నను దర్శించుమా (2)
ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను
వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను
దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను ||యెహోవా||

విచారము చేత నా కన్నులు గుంటలై
వేదన చేత నా మనస్సు మూగదై (2)
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు||

అవమానము చేత నా గుండెలో గాయమై
(నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2)
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు||

యెహోవా నను కరుణించుమా telugu christian video song


యెహోవా నను కరుణించుమా Song Lyrics