యెహోవాకు స్తుతులు పాడండి Song Lyrics

యెహోవాకు స్తుతులు పాడండి – మీరు
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు

ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు ||యెహోవాకు||

తంబురతోను సితారతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి
పావనాలంకారమును బొంది – మీరు ||యెహోవాకు||

భక్తులై ఘనులై హర్షింతురు
ఉత్సాహమున ఊప్పొంగెదరు
పడకల మీద ప్రభువును కోరి
పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు ||యెహోవాకు||

అన్య జనులను శిక్షించుటకు
రాజుల గొలుసుతో బంధించుటకు
రెండంచుల ఖడ్గమును ధరించిరి
దైవ భక్తులకు ఘనత యునిదే – మీరు ||యెహోవాకు||

యెహోవాకు స్తుతులు పాడండి telugu christian video song