యేసయ్యా నా ప్రాణనాథా నిను Song Lyrics

యేసయ్యా నా ప్రాణనాథా నిను
ఆడి పాడి కీర్తించెదను
నీవే నా జీవదాత అని
లోకమంతా చాటించెదను ||యేసయ్యా||

సర్వశక్తిమంతుడా సర్వాధికారి
సర్వలోకమును సృష్టించిన సుందరుడా (2)
స్తుతి మహిమా ఘనతా నీకే అని
సంతసించి స్తోత్రించెదను ||యేసయ్యా||

పాపమే ఎరుగని నీతిమంతుడా
పాపిని రక్షించిన నీతిసూర్యుడా (2)
పరిశుద్ధ పరలోక తండ్రి అని
పరవశించి నే పాడెదను ||యేసయ్యా||

ఆది అంతమైన అల్ఫా ఒమేగా
మేఘముపై రానున్న మహిమోన్నతుడా (2)
ఉన్నవాడవు అనువాడవు నీవని
ఉల్లసించి ఆరాధింతును ||యేసయ్యా||

యేసయ్యా నా ప్రాణనాథా నిను telugu christian video song


యేసయ్యా నా ప్రాణనాథా నిను Song Lyrics