యేసయ్యా యేసయ్యా Song Lyrics

యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా
యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా
నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే
కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా||

ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం
అయ్యో.. ఆరిపోవు దీపం
అయినా రాదు నీకు కోపం
గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి
జారే కన్నీళ్లు మాత్రం
పాపం చేసినోల్ల కోసం ||యేసయ్యా||

నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం
నిను మోసి కట్టుకుంది పుణ్యం
ఆహా సిలువదెంత భాగ్యం
ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం
మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే
చూసిన వారి జన్మ ధన్యం ||యేసయ్యా||

యేసయ్యా యేసయ్యా telugu christian video song


యేసయ్యా యేసయ్యా Song Lyrics