యేసే నా ఆశ్రయము Song Lyrics

యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవే… నా దుర్గము నీవే
నా కాపరి నీవే (2)

శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును (2) ||యేసే నా||

జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును (2) ||యేసే నా||

దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ (2)
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును (2) ||యేసే నా||

యేసే నా ఆశ్రయము telugu christian video song


యేసే నా ఆశ్రయము Song Lyrics