యేసూ నీకు కావాలని Song Lyrics

యేసూ… నీకు కావాలని
నన్ను కోరుకున్నావా (2)
నే ఘోర పాపిని ప్రభువా
ఆ.. ఆ.. ఎందుకయ్యా నాపై నీ ప్రేమ (2)

కలుషాల్ని కడిగిన కరుణామయుడా
కన్నీటి గాథను మలిచావా ప్రభువా (2)
ఈ పేద బ్రతుకును అరచేతులలో
చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2)
నేను నేనే కానయ్యా
నాలో నీవే యేసయ్యా (2)
నీ ప్రేమకుప్పొంగిపోనా
ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ||

దాహముతో ఉన్న నా యేసు ప్రభువా
నీ దాహం తీర్చే భాగ్యమునిమ్మయా (2)
నశియించు ఆత్మల దాహముతో
నను చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2)
నేను నేనే కానయ్యా
నాలో నీవే యేసయ్యా (2)
నీ ప్రేమకుప్పొంగిపోనా
ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ||

యేసూ నీకు కావాలని telugu christian video song