యేసు పరిశుద్ధ నామమునకు
ఎప్పుడు అధిక స్తోత్రము (2)
ఇహపరమున మేలైన నామము
శక్తి గల్గినట్టి నామమిది (2)
పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు||
సైతానున్ పాతాళమును జయించు
వీరత్వము గల నామమిది (2)
జయమొందెదము ఈ నామమున (2) ||యేసు||
నశించు పాపుల రక్షించు లోక
మున కేతెంచిన నామమిది (2)
పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు||
ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు
ఉన్నత దేవుని నామమిది (2)
లోకమంతా ప్రకాశించే నామమిది (2) ||యేసు||
శోధన, బాధల, కష్ట సమయాన
ఓదార్చి నడుపు నామమిది (2)
ఆటంకము తొలగించు నామమిది (2) ||యేసు||