యేసు రక్తమే జయం…యేసు రక్తమే జయం
యేసు నామం ఉన్నత నామం (2)
పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు
ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)
ఆశలన్ని అడి ఆశలుగా
మార్చునంత విపరీతముగా
చేయునదే నీ పాపము (2)
యెహోవా దయాళుడు…యెహోవా దయాళుడు
ఆయన కృప నిత్యముండును (2)
ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు
లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)
శ్రమయు బాధ హింస అయిననూ
కరువు వస్త్ర హీనతైననూ
ఖడ్గ మరణమెదురే అయిననూ (2)
యేసు పునరుత్థానుడు…యేసు పునరుత్థానుడు
మరణపు బలము ఓడిపోయెను (2)