యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా….
యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
మానవుల రక్షించే మహా దేవుడా (2)
నశియించినదానిని వెదకి రక్షించినావా (2)
చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా (2)
వందనమయ్యా నీకు వందనమయ్యా
యేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా (2)
కానాను పురమున కళ్యాణ సమయాన (2)
నీటిని ద్రాక్షా రసముగ మార్చి
విందును పసందుగా మార్చినావు (2) ||వందనమయ్యా||
నాయీను గ్రామాన విధవరాలి కుమారుని (2)
పాడెను ప్రేమతో ముట్టి
కన్నతల్లి కన్నీరు తుడిచినావు (2) ||వందనమయ్యా||
గెరాసేను దేశాన సమాధుల స్థలములోన (2)
సేన దయ్యమును వదిలించి
నశియించే ఆత్మను రక్షించినావు (2) ||వందనమయ్యా||