యేసుని ప్రేమ యేసు వార్త Song Lyrics

యేసుని ప్రేమ యేసు వార్త
వాసిగ చాటను వెళ్ళెదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము (2)
ప్రభు యేసు సన్నిధి తోడు రాగా
కడుదూర తీరాలు చేరెదము ||యేసుని||

మరణ ఛాయ లోయలలో
నాశన కూపపు లోతులలో (2)
చితికెను బ్రతుకులెన్నో (2)
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||

కాపరి లేని గొర్రెలుగా
వేసారెనుగ సమూహములే (2)
ప్రజలను చూచెదమా (2)
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||

యేసుని ప్రేమ యేసు వార్త telugu christian video song