ఏమివ్వగలను నీ ప్రేమకై – మనస్సుకు హత్తుకునే అద్భుత గీతం New Telugu Christian Songs 2020నా సాక్ష్యమే ఈ పాట.

నా బాల్యములో అనారోగ్యం కారణంగా లివర్ సైజ్ పెరిగిపోయి, 16 రోజులు మాటను కోల్పోయి చావుబ్రతుకుల మధ్య ఉన్న నన్ను, అప్పటికే విశ్వాసం పై ఆధారపడి ప్రభువు పిలుపుమేరకు చేసే వ్యాపారాలను విడచిపెట్టి, కుటుంబం, కన్నవారు వెలివేసినా, కట్టు బట్టలతో పరిచర్య ప్రారంభించిన నా తల్లిదండ్రులు పరిస్థితులు కఠినంగా ఉన్నా, తినటానికి తిండి లేకపోయినా పస్తులుండి కాళీ కడుపులతో అనేక నశించిపోతున్న వారికి ఆత్మీయ ఆహారాన్ని అందించటానికి, వెనుకడుగు వేయక ముందుకు వెళుతున్న సమయంలో… నా అనారోగ్యం వారికి ఒక పెద్ద పరీక్ష. కనీసం వైద్య పరీక్షలకు కూడా డబ్బు లేక బ్రతికినా చనిపోయినా ప్రభువు చిత్తం అని కన్నీరుతో ప్రభువును వేడుకున్నవేళ, నా ప్రభువు నన్ను బ్రతికించి, స్వరమిచ్చి, ఆరోగ్యవంతునిగా లేవనెత్తినందుకు నా ప్రభువుతో నేను చేసుకున్న నిబంధన.

16 రోజులు మాట కోల్పోయిన నాకు మరలా స్వరమిచ్చావు కాబట్టి ఇకనుండి మీ గురించే మాట్లాడతాను. నన్ను మరణంలోనుండి జీవంలోనికి నడిపించావు కాబట్టి నా మరణంవరకు మీ గురించే బ్రతుకుతాను. అప్పటినుండి ఇప్పటివరకు అనేకమైన అనుభవాలు, ఈ నిరీక్షణ మిమ్మును సిగ్గుపరచదు అనే వాక్య నెరవేర్పు ఈనాటి మా స్థితి. నా ప్రభువును గూర్చి మాట్లాడకుండా, పాడకుండా ఎలా ఉండగలను. ఏమివ్వగలను నా ప్రభువుకు… చెమ్మగిల్లిన నయనాలతో, కృతజ్ఞతా హృదయంతో నా ప్రభువు పాదాలపై ఒదిగిపోవటం తప్ప.
written by Pastor. K. Jagadeesh Paul
special thanks to bro. K.J.W.Prem garu for the music, and Raju bro for shooting and Tammudu Ajay for video editing. may God bless my Youth For Truth Ministries Team for your prayers and support. please watch and be blessed.
very beautiful and meaningful song.

source